దేని విలువ దానిదే

1
1245
WhatsApp Image 2020-09-23 at 2.40.48 PM-fe065a20

దేని విలువ దానిదే

నలుపు తెలుపుల వివక్ష ప్రపంచం అంతా ఉంది. వుయ్ ఆర్ బ్రౌన్స్ ఇన్ అమెరికా . రంగు ఏదైనా ఆరోగ్యంగా చలాకీగా ఉంటే ఎవరైనా చక్కగా అనిపిస్తారు. ఉన్నదాన్నే మెరుగు పెడితే ఇంకాస్త బాగుంటారు. పుత్తడి బంగారం అయినా పాతది అయితే నగిషి పెట్టిస్తారు. కాలి బూటు మట్టికొట్టుకుపోతే పాలిష్ చేస్తారు. చొక్కా నలిగితే ఇస్త్రీ చేస్తారు. ఇంటి ముందు అలా వదిలేయకుండా పేడతో అలికి ముగ్గులు పెడతారు. వీటికే ఇన్ని చేసినప్పుడు ఒక మనిషిగా మనకి మనం ఎందుకు చేసుకోకూడదు? అవన్నీ అందమైనపుడు. మనిషి తనని తాను ఎందుకు సంస్కరించుకోకూడదు? మేకప్ ఏ రకంగా తప్పు? బూటు పాలిష్ వేసినా అది కాలిని కరుస్తూ ఉంటే వ్యర్ధం. మనిషి కూడా ఎంత పాలిష్ చేసుకుని పోష్గా ఉన్నా నోటి అహంకారం దుర్గంధంలా ఉంటుంది.

దేని అందం దానిదే
అడివిలో బురద బాగుంటుంది, పట్టణంలో తారు రోడ్డు బాగుంటుంది.
సెలయేటి పక్క పూరి గుడిసె హాయిగా ఉంటుంది. న్యూయార్క్ నగరం ఆకాశ హార్మ్యం అబ్బో అనిపిస్తుంది.
సమాజానికి విఙానవంతులు ఎంత అవసరమో వినోదాన్ని అందించే వారు అంతే అవసరం. విఙానవంతులు మేము మహా మేధావులం అని విర్రవీగితే అసహ్యంగా ఉంటుంది. అలాగే వినోదవల్లరులు సెలెబ్రిటీలనుకుంటే చిరాకుగా ఉంటుంది.
చిన్ని మొలక ప్రేమని పుట్టిస్తుంది. మహా వృక్షం అహో అనిపిస్తుంది. కాని అదే వృక్షం వచ్చి తాను ఒకప్పటి మొలకనని మర్చి హేళన చేస్తే అసహ్యంగా ఉంటుంది.

వివక్షలు లేనిది ఎక్కడని?
సమాజం అంతా ఆర్ధిక, లింగ, వయో, కుల మత బేధాలు అసమానతలే. ఇంకా నలుపు తెలుపు, నాగరికం అనాగరికం వివక్షలెందుకు?

–Vijaya Nadella

1 COMMENT

  1. మనిషి కూడా ఎంత పాలిష్ చేసుకుని పోష్గా ఉన్నా నోటి అహంకారం దుర్గంధంలా ఉంటుంది . . విఙానవంతులు మేము మహా మేధావులం అని విర్రవీగితే అసహ్యంగా ఉంటుంది. అలాగే వినోదవల్లరులు సెలెబ్రిటీలనుకుంటే చిరాకుగా ఉంటుంది . .

    very thoughtfully written, even though they look like simpe !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here